మెట్పల్లి టౌన్, ఏప్రిల్ 29,జనంసాక్షి :భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై తులా గంగవ్వ ట్రస్ట్ మెమోరియల్ మరియు ఐక్యూ ఇనిస్ట్యూట్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలో సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నల్సర్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ కర్ణం మురళి మరియు విశిష్ట అతిథులుగా మెట్పల్లి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, తుల రాజేందర్ లు పాల్గొన్నారు అనంతరం ప్రొఫెసర్ మురళి మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అన్ని అంశాలను క్లుప్తంగా వివరించి,ఆర్టికల్స్ చట్టాల గురించి వివరించడం జరిగింది విద్యార్థులు ప్రతిరోజు రాజ్యాంగం లో పొందుపరిచిన అంశాలను చదువుతూ అన్యాయాలను ఎదిరించవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు.మన దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు అమెరికా బ్రిటన్ ఇతర దేశాలలో రాజ్యాంగంలో లేవని తెలిపారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్, సీనియర్ న్యాయవాదులు మగ్గిడి వెంకట నరసయ్య, రాజ్ మహమ్మద్, శేఖర్, వలియోద్దీన్ జగన్, రాములు, రాజశేఖర్, మహేష్, రాజేశ్వర్, సత్యనారాయణ మరియు విద్యార్థిని,విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు




