ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి
జహీరాబాద్ డిసెంబర్ 17( జనం సాక్షి ) తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నారు. శనివారం నియోజవర్గ అధ్యక్షుడు అలెగ్జాండర్ అధ్యక్షతన మొగుడంపల్లి మండల పరిధిలోని మిర్జంపల్లి తండాలో బీఎస్పీ పార్టీలో యువకులు చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కండవా వేసి పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఈశ్వర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జహీరాబాద్ శాసనసభ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మీ పైన ఉందని తెలియజేశారు
ఈ కార్యక్రమంలోవిశిష్ట అతిథి ఏ నటరాజ్ జిల్లా అధ్యక్షులు.డి ప్రేమ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు.
జహీరాబాద్ మండల ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాస్ టౌన్ ఉపాధ్యక్షులు ఆశీర్వాదం. సోషల్ మీడియా ఇంచార్జ్ సిద్ధార్థ్, సీనియర్ నాయకులు పెంటయ్య, సుభాష్, తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి




