హైదరాబాద్,(జనంసాక్షి): స్థానిక సంస్థలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. శాంతిభద్రతల అంశంపై పోలీసు అధికారులతో చర్చించామని చెప్పారు. ఎన్నికల నిర్వాహణ కోసం 160 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికి 104 కోట్ల రూపాయలను విడుదల చేసిందన్నారు. రేపు ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. 64 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని చెప్పారు.




