– 16తేదీ నాటికి బూత్ కన్వీనర్ల నియామకం పూర్తి చేయండి
– ఎన్నికల్లోపు రెండు, మూడు దశల్లో శిక్షణా కార్యక్రమాలు
– ప్రభుత్వంపై ప్రజల్లో 78శాతం సంతృప్తి ఉంది
– దానిని 100శాతానికి పెంచేలా కృషిచేయాలి
– ప్రత్యేక ¬దా కోసమే కాంగ్రెస్‌తో కలిశా
– విర్రవీగితే టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలా ప్రజలకు దూరమవుతాం
– టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబర్14(జనంసాక్షి) : ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగం బలోపేతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం టీడీపీ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకు లక్షన్నర పార్టీ సభ్యత్వం నమోదు జరగాలన్నారు. ప్రస్తుతం 74వేల సభ్యత్వ నమోదు జరుగుతోందని తెలిపారు. రాబోయో రోజుల్లో గ్రామ వికాసం ముమ్మరంగా జరగాలని, ప్రభుత్వంపై ప్రజల్లో 78 శాతం సంతృప్తి ఉందని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల్లోపు రెండు, మూడు దశల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని, 16వ తేదీ నాటికి బూత్ కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. సమర్థులైన అభ్యర్ధుల ఎంపికతోనే ఎన్నిక సులభం అవుతుందని సీఎం తెలిపారు. కసరత్తు లేకుండా ఎంపిక చేస్తే టీఆర్ఎస్ లాగా అవుతుందని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీ కీలక భూమికి పోషిస్తోందన్నారు. ప్రత్యేక¬దా కోసమే కాంగ్రెస్‌తో కలిశానని సీఎం మరోసారి స్పష్టం చేశారు. బీజేపీ అన్ని వ్యవస్థలను పతనం చేస్తోందన్నారు. తన విశ్వసనీయత వల్లే జాతీయ స్థాయిలో నేతలు ఆదరిస్తున్నారని తెలిపారు. విర్రవీగితే ప్రజలకు దూరమవుతామని, అందుకు బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీనే నిదర్శనమని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో ఏపీనే అగ్రస్థానంలో ఉందన్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక అవార్డులు సాధించామన్నారు. కేంద్రం సహకరించకపోయినా 66 ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఎన్నికల నాటికి.. బలోపేతం కావాలి




