ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలం పువ్వు – బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల

జనగామ బ్యూరో (జనంసాక్షి ): జనగామ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో బిజెపి పార్టీ దూసుకుపోతున్నది.బచ్చన్నపేట మండల కేంద్రం లో గోపాల్ నగర్ కాలనీలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి జిల్లా అధ్యక్షులు డా,, ఆరుట్ల దశమంత రెడ్డి పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ నగర్ కాలనికి విచ్చేసిన బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డా, ఆరుట్ల దశమంత రెడ్డి కి గ్రామస్థులు బ్రహ్మరథం పడుతున్నారు. కాలనీ వాసులు అందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బిజెపి పార్టీ భారీ మెజారిటీతో గెలిపియాలని అన్నారు.