ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమారెడ్డి అన్నారు. తాజా ఎన్నికల్లో తెరాస స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో ట్యాంపరింగ్‌ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. వీవీప్యాట్‌ల్లోని స్లిప్‌లను కూడా లెక్కించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాకూటమి అభ్యర్థులంతా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీప్యాట్‌లను లెక్కించే వరకూ పట్టుబట్టాలన్నారు. ఎవరు ఓడిపోతారో తెరాస నేతలు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇదంతా ట్యాంపరింగ్‌ను బలపరుస్తున్నాయని విమర్శించారు.