ఎన్నికల హామీలను నెరవేర్చాలి – మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు.. కమాన్ పూర్ జెడ్పిటిసిగా పోటీ చేసిన సమయంలో మండల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు డిమాండ్ చేశారు. శనివారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి లోని తన నివాసంలో ఆయన మాట్లాడారు. కమాన్ పూర్ మండల కేంద్రంలో డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్, పెంచికల్పేట్ రైల్వే ట్రాక్ వరకు డబుల్ లైన్ రోడ్, తాసిల్దార్ బిల్డింగ్ తదితర హామీలు ఇప్పటికీ హామీలుగానే మిగిలిపోయాయని అన్నారు. నిన్న ,మొన్న రెండు రోజులు సీఎం కేసీఆర్ తో ఉన్నానని మంథని నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించానని చెప్పావు కదా..? మరి అందులో కమాన్పూర్ మండలం నుండి నీకు ఓటు వేసి పునర్జన్మని ఇచ్చిన కమాన్పూర్ మండలానికి సంబంధించిన పనుల గురించి ఎందుకు చర్చ రాలేదు..? అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను నెరవేర్చని ఎడల రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కమాన్పూర్ లో ఓట్లు అడిగే నైతిక హక్కు పుట్ట మధుకు లేదని అన్నారు. ఆయన వెంట జూలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతి, నాయకులు బొజ్జ సతీష్ తదితరులు ఉన్నారు.