ఉపరాష్ట్రపతి రాకతో భారీగా ఏర్పాట్లు
విజయవాడ,మే21(జనం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీన గన్నవరం మండలం కొండపావులూరులో పర్యటించనున్నారు. కొండపావులూరులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ శిక్షణ కేంద్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆర్‌ఎస్ నెంబరు-6లో ప్రభుత్వం కేటాయించిన 36.76 ఎకరాల్లో శిక్షణ కేంద్రం, వసతి భవనం తదితరాలు నిర్మించనున్నారు. నేషనల్ బిల్డింగ్ కన్‌స్టక్షన్స్ర్ కార్పొరేషన్ సంస్థ నిర్మాణ పనులు చేపట్టనుంది. ఆ కార్యక్రమ ఏర్పాట్లను జిల్లా కలెక్టరు బి.లక్ష్మీకాంతం, పలు శాఖల
ఉన్నతాధికారులు పరిశీలించారు. త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. సంయుక్త పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఏసీపీ విజయభాస్కర్, నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, గన్నవరం తహసీల్దారు ఎం.మాధురి, ఎంపీడీవో వై.ఇందిరా ప్రియదర్శిని, మండల ప్రత్యేక అధికారి సుధాకర్, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ అశోక్‌కుమార్, ఆర్‌అండ్‌బీ డీఈ కిశోర్ బాజ్జీ తదితరులు పరిశీలించారు. సభాస్థలికి చేరుకునేలా రోడ్డు నిర్మించారు. మరోవైపు కొండపావులూరులో రోడ్లకి రువైపులా శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి రోడ్డు మార్గాన వస్తారని గన్నవరం నుండి శంకుస్థాపన ప్రదేశం వరకూ ఆర్‌అండ్‌బీ రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు.
శంకుస్థాపన పనులను కలెక్టర్ లక్ష్మీకాంతం పరిశీలించారు. టెంట్‌లు ఏర్పాటు చేశారు. ప్రాంగణాన్ని, శంకుస్థాపన స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని ఆర్డీవో చెరుకూరి రంగయ్యను ఆదేశించారు. డాగ్, బాంబ్ స్వ్కాడ్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పోలీస్ జాయింట్ కమిషనర్ డి.కాంతిరాణా టాటా ఏర్పాట్లను పరిశీలించారు. ఏసీపీ విజయభాస్కర్, సీఐ శ్రీధర్‌కుమార్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. డీపీవో సుబ్రహ్మణ్యం, డీసీవో ఆనందబాబు, స్పెషల్ ఆఫీసర్ సుధాకర్, తహసీల్దార్ ఎం.మాధురి, ఎంపీడీవో వై.ఇందిరా ప్రియదర్శిని, పలువురు అధికారులు పాల్గొన్నారు.
—–
ఎన్‌ఐడిఎంకు నేడు వెంకయ్య శంకుస్థాపన




