Friday, 6 November 2026

కర్నాటకలో నైతిక విజయం బిజెపిదే: బిజెపి

నెల్లూరు,మే21(జ‌నం సాక్షి): కర్ణాటకలో బీజేపీదే నైతిక విజయమని, కాంగ్రెస్‌-జేడీఎస్‌ అంకెల గారడీ ఆడాయని బీజేపీ కార్యదర్శి సురేష్‌రెడ్డి విమర్శించారు. అక్కడ అనైతికతకు పాల్పడింది కాంగ్రెస్‌- పార్టీ అని అన్నారు. ఏ లాలూచీ లేకుండా కుమారస్వామికి మద్దతు ఇస్తున్నారో చెప్పాలని అన్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి చంద్రబాబు వెళ్తే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా, రాహుల్‌ పాదాల వద్ద పెట్టారని వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రజలు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని సురేష్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌కు  మద్దతుగా మాట్లాడడడం మంచిది కాదన్నారు. ఇది టిడిపి సిద్దాంతాలకే వ్యతిరేకమన్నారు.