ఎన్‌హెచ్ కపాడియా తర్వాత సీజేఐగా అల్తామన్ కబీర్
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్న చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా (సీజేఐ) ఎన్‌హెచ్ కపాడియా తన తర్వాతి సీజేఐగా సీనియర్ జడ్జి జస్సిస్ అల్లామన్ కబీర్‌ని సిఫార్సు చేశారు. ఈ మేరకు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. కపాడియా ఈ నెల 28న పదవీ విరమణ పొదనున్నారు. నిబంధనల మేరకు సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్, తగిన అర్హతలు కలిగిన జడ్జిని సీజేఐగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇందులో భాగంగా న్యా శాఖ పదవీ విరమణ చేయనున్న సీజేఐ సిఫార్సులను కోరుతుంది. ఈ సిఫార్సులు వచ్చాక వాటిని ప్రధాన మంత్రికి పంపుతుంది. ఆయన వీటిని పరిశీలించి రాష్ట్రపతికి పంపుతారు. 2013 జులై 18న కబీర్‌కి 65 ఏళ్లు పూర్తవుతాయి. అప్పుడు ఈయన పదవీ విరమణ చేస్తారు.