Friday, 6 November 2026

ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కు అంతిమ వీడ్కోలు

ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కు అంతిమ వీడ్కోలు

‌రఘునాధపాలెం నవంబర్ 23 జనం సాక్షిగా

అంతిమ యాత్రలో మంత్రులతో కలిసి పాడె మోసిన ఎంపీ రవిచంద్ర.

రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస రావు భౌతిక‌కాయానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లతో కలిసి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు. పాడె మోసారు
శ్రీనివాస రావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి, మనో ధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని మన ముఖ్యమంత్రి కె సి అర్ ప్రభు త్వం తరుపున రూ.50 లక్షా లు కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇంటి స్థలం ప్రకటించిందన్నారు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మంత్రులు వెంట రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్యేలు రెగా కాంతారావు రాములు నాయక్ మెచ్చ నాగేశ్వరరావు ఎమ్మెల్సీ తాత మధు జెడ్ పి చైర్మన్ లింగాల కమల్ రాజు సిఎండి సెక్రటరీ స్మీత సబర్మాల్ హరితాహరం ఓ ఎస్ డి ప్రియాంక వర్గిస్ అటవీశాఖ స్వెషల్ సిఎస్ శాంత కుమారి అటవీశాఖ ఉన్నతాధికారులు డోబ్రియల్ లోకేష్ జైస్వాల్ ఖమ్మం కలెక్టరు వి పి గౌతమ్ భద్రాద్రి కోత్తగూడెం కలెక్టరు అనుదీప్ కోత్తగూడెం ఎస్పీ వినీల్ ఇతర ఉన్న తాధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు