టేకులపల్లి, ఫిబ్రవరి 8 (జనం సాక్షి ): ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల కోయగూడెంలో పదవ తరగతి విద్యార్థుల ఎఫ్.ఏ ఇంటర్నల్ మార్కులను బోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.జగన్ ఆధ్వర్యంలోని మండల పరిశీలకుల బృందం పరిశీలించిందని ఏహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు బి.అమర్ సింగ్ తెలిపారు. పరిశీలక బృందం పదవ తరగతి విద్యార్థుల యొక్క రాత పుస్తకాలను,ఎఫ్ఏ రికార్డులను,మార్కులు వేసిన తీరును క్షుణ్ణంగా పరిశీలించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో టీం లీడర్ జగన్ మాట్లాడుతూ,పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు అందించి 100% ఉత్తీర్ణతతో పాటు పది జీపీఏ ఎక్కువ మంది విద్యార్థులు సాధించేటట్టు కృషి చేయాలని అన్నారు. ఈ బృందంలో కవిత, రాంబాబు, బాలు, ఫాల్గుణ,తారాసింగ్,మోహన్ రావు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




