నాగర్ కర్నూల్ జిల్లా తెనుగోళ్ళ మిత్ర బృందం భవన నిర్మాణ జిల్లా నాయకులు గూళ్ళ.హరికృష్ణ,డాక్టర్ పెబ్బేటి.మల్లికార్జున్….నాగర్ కర్నూల్ మండల మత్స్య సహకార సంఘాల మండల్ ముఖ్య నాయకుల సమావేశం ….నాగర్ కర్నూల్ రూరల్ ఫిబ్రవరి8(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీ మీటింగ్ హాల్.ఈరోజు మత్స్యకారులు మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి నాగర్ కర్నూల్ మండల్ సంబంధించిన అన్ని గ్రామాల సొసైటీ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు,కార్యదర్శులు వచ్చి తమ తమ సందేశాలను వ్యక్తం చేశారు.దీనికి ముఖ్యఅతిథిగా పెబ్బేటి.మల్లికార్జున్ రావడం జరిగింది.ఆయన మాట్లాడుతూ,మత్స్యకారులు అన్ని విధాలుగా ముందుండాలని అన్నారు ప్రతి మత్స్యకారుడు చనిపోయిన కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు లక్షల బీమా పొందే విధంగా చేపడుతున్నావని ఆయన అన్నారు.అదేవిధంగా మత్స్యకారుల ఐక్యతతో ఉండాలని కలిసిమెలిసి స్నేహభావంతో ప్రతి ఒక్క మత్స్యకారుడు బిచ్చగానిగా మారకుండా ధనవంతులుగా మారాలని ఆయన అన్నారు.మన జాతిని అంతరించిపోకుండా ప్రతి ఒక్క మత్స్యకారుడు కలిసికట్టుగా ఉండాలని ఆయన అన్నారు.అదేవిధంగా మత్స్య సహకార సంఘాల మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ మాట్లాడుతూ,చెరువు కుంటలపై దాడులు అగ్ర కులాల వారు దాడి చేసి చేపలను అమ్ముకోవడం చేపలను తినడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.మత్స్య సంపదపై దాడి చేస్తే చూస్తు ఓరుకోం అని తెలిపారు.చెరువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలి అని తెలిపారు.రక్షణ హక్కు చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు నేను ఉన్నానని.ఆయన భరోసా ఇస్తూ ప్రతి ఒక్క మత్స్యకారునికి ధైర్యం చెప్పే విధంగా ఆయన ముందుండి నడిపిస్తారని వాగ్దానం ఇచ్చిన గూళ్ళ.హరికృష్ణ అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి మత్స్యకారుడు అభిప్రాయాల్ని వ్యక్త చేయడం జరిగింది.ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ జిల్లా అడ్వకేట్ గొర్ల.శ్రీనివాస్ మాట్లాడుతూ,జాతి ఐక్యత కోసం అందరం కలిసి నడుద్దాం.తెనుగోళ్ళ జాతి తెగువకీ ప్రతీక అని తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ అని తెలిపారు.బిజెపి నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు పోల్ దాస్.రాము మాట్లాడుతూ,జాతి నిర్మాణం మనకు ఎంతో అవసరం.రాబోయే ముందు తరాలకు మనం ఐక్యతతో కలిసి నిర్మించిన మన భవనాలు, చెరువులు,రిజర్వాయర్ లు.మన హుక్కులను తెలియజేస్తాయి అని తెలిపారు.50 లక్షల మంది జనాభా ఉన్న మత్స్య కారులు రేపు రానున్న రోజుల్లో యువత రాష్ట్ర రాజకీయాల్లో 20మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్యకారులు మండల ఉపాధ్యక్షుడు గూళ్ళ.చెన్న కేశవులు,ఈర్ల.శోభన్,కొరుపాల.చంద్రశేఖర్,కార్యదర్శి గొడుగు.సహాదేవుడు,మండల ప్రచార కార్యదర్శి కొండమోని.భీమ్మయ్య,యనమోని.తిరుపతయ్య,జిల్లా కార్యదర్శి బచ్చలి.బంగారయ్య,జిల్లా అధికార ప్రతినిధి తవిటి.నిరంజన్,ఎర్రవోలు.సలేశ్వరం,గ్రామ గ్రామన నుంచి చెరువు సొసైటీ అధ్యక్షులు,కార్యదర్శి లు,మత్స్యకారులు పాల్గొన్నారు.




