అధికారుల జాప్యానికి కోటగిరి లో మన ఊరు మన బడి పనుల మందగమనం.కోటగిరి ఫిబ్రవరి 8 జనం సాక్షి:-కోటగిరి మండలంలో మన ఊరు మన బడి పనులు మందకొండిగా జరుగుతున్నా యని మండల సభ వేదికగా బహిర్గతంగా అయింది. బుధవారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ వల్లేపల్లి సునిత శ్రీనివాస్ అధ్యక్షతన అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన మన ఊరు మన బడి పనుల పురోగతిపై జరిగిన సమీక్షా సమావేశంలో ప్రజాప్రతినిధులు,కాంట్రాక్టర్లు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు,కాంట్రాక్టర్లు మాట్లాడుతూ మన ఊరు మన బడి పనులలో ప్రత్యక్షంగా అవుతున్నఖర్చుకు,అధికారులు రికార్డ్ చేసే ఎంబిలకు పొంతన లేక పనులను చేయలేక పోతున్నామని వారు వాపోయారు.కోటగిరి మండల ఏఈ పనితనం అంతగా బాగా లేదని,పనుల విషయంలో గందరగోళంగావ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ వల్లేపల్లి ఎంపీపీ సునిత శ్రీనివాస్ కలగచేసుకొని ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు.అదేవిధంగా ఈ విషయమై సంబంధిత అధికారులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మన ఊరు మన బడి పనులు సజావుగా,త్వరితగతిన పూర్తి చేయడంలో ఒకరికొకరు సఖ్యతగా నిర్దేశిత సమయంలో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మన ఊరు మన బడి డివైఈ అంజిరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్,వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్,ఎంపీడీవో మారుతి, ఎంఈఓ నాగ్ నాథ్,మండల సర్పంచులు,ఎస్ఎంసి చైర్మన్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.




