ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరావు హత్యకు కేంద్ర, రాష్ట్ర పాలకులే భాద్యత వహించాలిఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరావు హత్యకు కేంద్ర, రాష్ట్ర పాలకులే భాద్యత వహించాలి* పొడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలి * న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శిసాధినేని వెంకటేశ్వరరావు
టేకులపల్లి, నవంబర్ 24( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రబొడు గ్రామంలో పొడు భూముల విషయంలో జరిగిన ఘర్షణ లో స్థానిక ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురి కావడం, అలాంటి దురదృష్టకరమైన హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిపిఐ (ఎంఎల్) న్యూడెమెాక్రసి భావిస్తుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిసాదినేని వెంకటేశ్వరరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర పాలకులు కార్పొరేట్ సేవలో తరిస్తుా కింది స్థాయి అధికారులను బలిపశువులు చేస్తున్నారని, అదే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన వ్యతిరేక వైఖరులను మానుకోవాలి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. అడవిలో పుట్టి, అడవి పెరిగి, అడవి లోనే చనిపోతున్నా కోట్లాది మంది గిరిజనులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అటవీ భూముల్లో జీవనాధారంగా బతుకు వీడుస్తున్న ఆదివాసీ గిరిజనులపై వారి పొడు భూములో పంటలను విధ్వంసాన్ని ఆపివేయలని వారికి న్యాయంగా వారి భూములకు రావలసిన పట్టాలను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఎఫ్ ఆర్ ఓ శ్రీనివాసరావు హత్యకు కేంద్ర, రాష్ట్ర పాలకులే భాద్యత వహించాలిఎఫ్ ఆర్




