Sunday, 8 November 2026

రాజ్యాంగ ఆమోద దినోత్సవ ఆహ్వానం

రాజ్యాంగ ఆమోద దినోత్సవ ఆహ్వానం
జహీరాబాద్ నవంబర్ (జనం సాక్షి )సమతా సైనికులు ఆధ్వర్యంలో బస్టాండ్ పక్కన మహేశ్వరి థియేటర్ కి ఎదురుగా ఉన్నటువంటి షట్కర్ ఫంక్షన్ హాల్ లో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని 26 నవంబర్ 2022 శనివారం నాడు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:00 వరకు సభా కార్యక్రమం ఉంటుంది సమతా సైనిక్ దళ్ జహీరాబాద్ డివిజన్ నాయకులు తెలిపారు
ఈ సభ నిర్వహణ కార్యక్రమానికి ముఖ్య అతిధులు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు , అతిథులు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీబీ పాటిల్. సాయిచంద్ గిడ్డంగుల సంస్థ చైర్మన్ తెలంగాణ, మచ్చ దేవేందర్, రచయిత, కవి, ప్రజా గాయకుడు, జహీరాబాద్ డిఎస్పి రఘు, బీరయ్య యాదవ్, బిసి సంఘం ప్రధాన కార్యదర్శి తెలంగాణ, అతి మేల మాణిక్యం, ఉపాధ్యక్షులు కులవ్యక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణ, ఫుల్ మామిడి రాజు, ముదిరాజ్ సంఘం, సంగారెడ్డి జిల్లా. వైద్యనాథ్ గెజిటెడ్ ఆఫీసర్ల అధ్యక్షులు, సంగారెడ్డి. మాతంగి చిరంజీవి మాదిగ రిజర్వేషన్ పోరాట సంఘం, సంగారెడ్డి. రామారావు న్యాయవాది, అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధ్యక్షులు సంగారెడ్డి. బాలరాజ్ సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు, సంగారెడ్డి. ప్రకాష్ రాథోడ్ లంబాడి హక్కుల పోరాట సంఘం, సంగారెడ్డి జిల్లా నాయకులు వస్తున్నారని,అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఇతర నాయకుల పుస్తకాలను కూడా కొనుగోలుదారుల కోసం తీసుకొస్తున్నారని తెలుపుతూ రాజ్యాంగ దినోత్సవానికి కుల,మతా, ప్రాంత, భేదం లేకుండా అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలిపారు. సమతా సైనిక్ దళ్ జహీరాబాద్ డివిజన్ అధ్యక్షులు కర్ణం రవికుమార్, శ్రీనివాస్, వెంకట్, కొనింటి నర్సింలు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.