Tuesday, 3 November 2026

బస్టాండ్ వద్ద బాత్రూం సౌకర్యం కల్పించండి

శివ్వంపేట జూన్ 24 జనంసాక్షి : తూప్రాన్ నర్సాపూర్ ప్రధాన రోడ్డుకు అనుకొని ఉన్న మండల కేంద్రమైన శివ్వంపేట ప్రయాణ ప్రాంగణం ( బస్టాండ్ )వద్ద గ్రామస్తులు, ప్రయాణికుల సౌకర్యం కొరకు మరుగుదొడ్డి తో కూడిన బాత్రూం సౌకర్యం కల్పించాలని శివంపేట గ్రామానికి చెందిన క్యాసాని వెంకటేష్ శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి గజ్వేల్ రూట్లో ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణికులు, వాహనదారులు వారి యొక్క రాకపోకలు కొనసాగిస్తున్నారని, కానీ ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో గ్రామపంచాయతీ పాలకులతో పాటు రవాణా శాఖ పూర్తిగా విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. తూప్రా నర్సాపూర్ ప్రధాన రోడ్డు కానుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శివంపేట ఇండియన్ బ్యాంక్, పలు వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. అయితే బస్ స్టాప్ వద్ద మలమూత్ర విసర్జనకు ఎటువంటి బాత్రూం లేకపోవడంతో ఎంతమంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఎంతో ఇబ్బంది గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికైనా స్థానిక గ్రామ పంచాయతీ పాలకులు స్పందించి నీటి సదుపాయంతో కూడిన బాత్రూం నిర్మించాలని క్యాసాని వెంకటేష్ డిమాండ్ చేశారు.