ఎమ్మెల్యేకు పరామర్శ…
డోర్నకల్ ప్రతినిధి డిసెంబర్ 22 (జనం సాక్షి):ఇటీవల మోకాలి శస్త్ర చికిత్స జరగగా గత రెండు నెలలు హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్న ఎమ్మెల్యే డీ.ఎస్ రెడ్యానాయక్ పూర్తి ఆరోగ్యం ఆయన స్వగృహం ఉగ్గంపల్లి చేరుకున్నారు.గురువారం నరసింహుల పేట మండలం రూప్ల తండా సర్పంచ్ గుగులోతు లక్ష్మి, లక్ష్మణ్, గ్రామస్థులతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే రెడ్యానాయక్ కు బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవలు ఎంతో అవసరమని ఆమె అన్నారు.




