బెల్లంపల్లి, జూన్ 3, (జనంసాక్షి )
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మహిళా ఆత్మహత్యయత్నం చేసుకోవడం సిగ్గు చేటు, అని శేజల్ అనే మహిళని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగిక వేధింపులకు గురిచేసి, ఆమె దగ్గరున్న ఆధారాలు లాక్కొని, అతని మనుషులతో శేజల్ కు వల్ల కుటుంబసభ్యులకు బెదిరింపులకు పాల్పడుతున్న దుర్గం చిన్నయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల బీఎస్పీ జోనల్ కన్వీనర్ భవాని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బెల్లంపల్లి ప్రజలు రాజకీయంగా బొంద పెట్టాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఒక మహిళ ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నం చేసుకోవడం సిగ్గు చేటు అని, మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో బిఎస్పి బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గొర్లపల్లి వరప్రసాద్, జిల్లా మహిళా కన్వీనర్ వినోద, మందమర్రి మండల కన్వీనర్ అసం రామ, జాడి సాగర్ పాల్గొన్నారు
ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి. – మంచిర్యాల జిల్లా బిఎస్పీ జోనల్ కన్వీనర్ భవాని.




