Wednesday, 4 November 2026

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య – శ్రీనివాసపురంలో బడిబాట కార్యక్రమం – పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిక్కుల గోవింద్

హుజూర్ నగర్ జూన్ 3 (జనంసాక్షి): ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిక్కుల గోవింద్ అన్నారు. శనివారం
మండల పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిక్కుల గోవింద్ ఘనంగా ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను నాణ్యమైన ఉపాధ్యాయులు అందిస్తున్నారని, బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలని, ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, ఇంగ్లీష్ మీడియం, రుచికరమైన మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలన్నారు. గ్రామంలో బడిబాట ర్యాలీని విద్యార్థులు, గ్రామ పెద్దల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంజుల, రామమూర్తి, జానీ బేగం, రవి కిషోర్, మాస్టర్ వేణు అంగన్వాడీ టీచర్లు మంజుల, పార్వతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.