గద్వాల నడిగడ్డ, జూన్ 3 (జనం సాక్షి);
తెలంగాణ రైతుల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.శనివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవాన్ని మానవపాడు మండలం కొరివిపాడు(కొరివిపాడు, చంద్రశేఖర్ నగర్, శ్రీనగర్) క్లస్టర్ రైతు వేదికలో రాష్ట్ర ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం గార్ల తో కలిసి రైతు దినోత్సవం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతు వేదికకు ఎద్దుల బండిలో వందలాది మంది రైతులతో డప్పులు రైతుల కోలాహలం మధ్య రైతు వేదికకు తరలి వెళ్లారు. రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో “మన తెలంగాణా దేశానికే అన్నపూర్ణ అనే ముఖ్య మంత్రి సమాచారాన్ని వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ రైతులకు చదివి వినిపించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలో ప్రవేశిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏరువాక పౌర్ణమి ముందు ఇట్టి పండుగ వాతావరణం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. రైతులు ఆరు తాడిపంటలైన కంది, ప్రతి, ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల అధిక లాభాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ మే మాసాలలో కురిసిన అకాల వర్షాలకు కొత్తమే ర పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ అన్నారు.అన్ని రంగాలలో అభివృధి సాదించి తెలంగాణా రాష్రం అన్నపూర్ణ రాష్ట్రం గా ఏర్పడిందని, ప్రతి 5 ఎకరాలకు ఒక క్లస్టర్ గ ఏర్పాటు చేసి ఏ ఇ ఓలను ఏర్పాటు చేసిందని, జిల్లా లో 97 క్లస్టర్లు ఉనాయని, రైతులు వరి, పత్తి , కందిపప్పు , అయి ల్ పంట సాగు పై అవగాహన కల్పించుకొని ఈ పంటలపై దృష్టి పెట్టి సాగు చేస్తే రైతులకు ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి ఐ ఎ ఎస్ మాట్లాడుతూ 2014 ముందు వ్యవసాయం ఎలా ఉన్నది, గత తొమ్మిదేళ్లలో వ్యవసాయం ఎంత అభివృద్ధి చెందిందో వివరించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో రైతు వేదికలు ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. రైతులు వరికి బదులు ఇతర ఆరుపడి పంటలు కంది, ప్రతి ఆయిల్ ఫామ్ సాగు చేయడం వల్ల ఎంతో లాభాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఆర్డిఎస్ తో పాటు తుమ్మిళ్ల రిజర్వాయర్ నుండి మల్లమ్మ కుంట వరకు నీరందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్డీఎస్ లోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దేశానికి వెన్నెముక అందుకు ముఖ్యమంత్రి దశాబ్ది ఉత్సవాలలో మొదటి రోజు రైతు దినోత్సవం ఏర్పాటు చేశారు అని తెలిపారు. కొరివిపాడు గ్రామంలో రూ. 65 లక్షలతో సిసి రోడ్లు వేశామని, 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
సమావేశం అనంతరం దాదాపు 1400 వందల మంది వరకు రైతులు, గ్రామ ప్రజలు బోజనాలు చేసారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు శ్రీనివాసులు రాంబాబు, ఎంపీపీ అశోక్ రెడ్డి, డి ఏ ఓ గోవింద్ నాయక్, రైతు సమితి అధ్యక్షులు వెంకటేశ్వర్లు శేఖర్ రెడ్డి, నాగేశ్వరరావు రెడ్డి, శ్రీరాంరెడ్డి,అసిస్టెంట్ డి ఆర్ డి ఏ నాగేంద్రం, ఎం పి డి ఓ రమణారావు, సంబందిత అధికారులు , రైతులు, మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.




