Friday, 6 November 2026

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు నిరసనగా బిజెపి దిష్టిబొమ్మ దహనం.

ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు నిరసనగా బిజెపి దిష్టిబొమ్మ దహనం.
జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 27 అక్టోబర్ 2022
నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం, ఉప్పునుంతల మండల కేంద్రంలో, నిన్న జరిగినటువంటి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల, కొనుగోలు కుట్రకు నిరసనగా ఉప్పునుంతల మండల కేంద్రం పోచమ్మ చౌరస్తాలో బీజేపీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు, శ్రేణులు,
జై తెలంగాణ జై కేసీఅర్ జై గువ్వల బాలరాజు అంటూ నినదాలు చేసిన పార్టీ శ్రేణులు,
బిజెపి నాయకుల కుట్రలను బట్టబయలు చేసి “తెలంగాణ నాట్ ఫర్ సేల్ ” అని తెలంగాణ సమాజానికి చాటిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించిన పార్టీ శ్రేణులు,
బిజెపి చేస్తున్న అధర్మ యుద్ధంలో న్యాయం ధర్మం వైపు నిలబడ్డ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిక అని అన్నారు,ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్త రవీందర్ రావు, సింగిల్ విండో చైర్మన్ సత్తు భూపాల్ రావు, మరియు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.