Friday, 6 November 2026

బిజెపి కుట్రలను నిరసిస్తూ కొండమల్లేపల్లి చౌరస్తాలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు

బిజెపి కుట్రలను నిరసిస్తూ కొండమల్లేపల్లి చౌరస్తాలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండమల్లేపల్లి అక్టోబర్ 27 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో గురువారం నాడు జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా పసునూరు యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల సర్కారులను కూలదొసే బిజెపి గద్దల చూపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై పడిందని, తెలంగాణలోను షిండేలను తయారు చేస్తామని బిజెపి నేతలు అడ్డగోలు పనికి దిగారు కోట్ల రూపాల కట్టలతో క్యాషాయ స్వాములు హైదరాబాద్ కు విచ్చేశారు నలుగురు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి నిసిగ్గుగా బేరసారాలు జరిపారు మౌనంగా మోసపోవడానికి ఇది మహారాష్ట్ర కాదు రణ తెలంగాణ, ఉద్యమ తెలంగాణ అని తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, ముఖ్యమంత్రి కేసీఆర్ దించే కుట్ర, మెడలో రుద్రాక్షలు, మదిలో విష కక్షలు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు అని అన్నారు ఒక్కో ఎమ్మెల్యే కి వంద కోట్లు ఇస్తామని భారీ ఆఫర్, వందల కోట్లు కాంట్రాక్టులు కట్టబెడతారని ప్రలోభాలు, అడిగిన వారికి పదవులు ఇస్తామని భారీ ఆఫర్ ఎర చూపుతో రెడ్ హ్యాండెడ్ గా డబ్బు సంచులతో దొరికిపోయారని ఎద్దేవ చేశారు ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదని హితవు పలికారు కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవులు, ఆశ చూపి టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని బిజెపి చేసిన కుట్రలను వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో ఎలిమినేటి సాయి, నజీర్ మౌలానా, నేరేడుగొమ్ము వైస్ ఎంపీపీ ఆరెకంటి రాములు, కొణిదల వెంకటయ్య, బావండ్ల దుర్గయ్య, వస్కుల వెంకటేష్, అందుగుల సైదులు, రఘు, తోటపల్లి కృష్ణయ్య, మురళి, నరసింహ చారి, వసుకుల శ్రీనివాస్, బాలకృష్ణ, బోడ శ్రీనివాస్ యాదవ్, జంగా చారి, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు