Friday, 6 November 2026

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహణం ముప్కాల్

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహణం ముప్కాల్ అక్టోబర్ 27(జనం సాక్షి) మండల కేంద్రంలో బిజెపి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగినది
మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు మూస్కు భూమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న నాలుగు వందల కోట్లకు బిఆర్ఎస్ చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి కుట్ర చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మ ముప్కాల్ మండల కేంద్రంలో దహనం చేయడం జరిగినది. కెసిఆర్ చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక ఇలాంటి చిల్లర రాజకీయాలు పాల్పడుతున్న బిజెపి నాయకుల ఆలోచనలను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ వెంకటరెడ్డి జెడ్పిటిసి బద్దం నరసవ్వ నర్సారెడ్డి కో ఆప్షన్ సభ్యుడు మునిరుద్దీన్ ముప్కాల్ సర్పంచ్ కొమ్ముల శీను కొత్తపల్లి సర్పంచ్ మారెల్లి విష్ణు ముప్కాల్ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ కొత్తపెల్లి ప్రెసిడెంట్ శేఖర్ మోహన్ రెడ్డి బాలరాజ్ రఘునాథ్ విశ్వనాధ్ పాల్గొన్నారు