Tuesday, 3 November 2026

ఎమ్మెల్యే అబ్రహం కి వినతి పత్రా లు అందజేసినా పలు సంఘల నాయకులు

అలంపూర్ జూలై 5(జనంసాక్షి ) అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఐజ మున్సిపాల్టీ లోని కుమ్మరి శాలివాహన కమిటీ సభ్యులు కమ్యూనిటీ హాల్ కొరకు, ఉప్పరి సంఘం సభ్యులు కమిటీ హాల్ షేడ్ నిర్మాణం కొరకు, శ్రీశ్రీశ్రీ.తిక్క విరేశ్వర్ర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు దేవాలయంలో అవరణలో జరిగే మీ మీద ప్రజాహిత క్రీడా కార్యక్రమాలు, మరియు జాతరలో జరిగే డ్రెస్సింగ్ రూమ్స్ వగైరా వేదిక ఏర్పాటు కొరకు మరియు ఐజ మున్సిపాలిటీలోని గాంధీ మహాత్మ వీడికి చెందిన గొల్ల కురుమలు మా సంఘం సభ్యులందరికీ గొర్రెల పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్యే కి వినతి పత్రలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ, తప్పకుండా పరిశీలించి నిధులు మంజూరు చేసే విధంగా గొర్రెల పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.*
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి , జిల్లా కో ఆర్డినేటర్ మల్లికార్జున్ ,మాజీ కౌన్సిలర్ మహేంద్ర ,చిన్న యాదవ్ మరియు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.