జిల్లా విద్యాశాఖాధికారి కి టియుడబ్ల్యూజే (ఐ.జె.యు) విన్నతి
ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం రాయితీ ఇప్పించాలని కోరుతూ టి. యు. డబ్ల్యూ.జే ( ఐజేయు) జిల్లా శాఖ బుధవారం ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించింది .సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ఖమ్మం నగరం పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇచ్చే విధంగా జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా డీ.ఈ.వోకు విన్నవించడం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించిన డి.ఇ.ఓ సోమశేఖర్ శర్మ రెండు రోజుల్లో సర్కులర్ జారీ చేయడంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు . జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసిన వారిలో టి. యు డబ్ల్యూ.జే (ఐజెయు)ఖమ్మం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యెగినాటి మాధవరావు ,నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, ప్రెస్ క్లబ్ కోశాధికారి నామ పురుషోత్తం , నగర నాయకులు కళ్యాణ్, మేడి రమేష్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు.




