ధర్మపురి (జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లినాయగం కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగా స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది, తదనంతరం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల ప్రకారం దేవాలయంలో జరుగు అభివృద్ధి పనులతో పాటు త్వరలో నిర్మాణం చేపట్టబోయే హోమశాల పనులను రాష్ట్ర దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లినాయగం పనులను పర్యవేక్షించినారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉపప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు,దేవస్థానం అసిస్టెంట్ ఇంజనీర్ ప్రతాప్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లినాయగం కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు




