*ఎమ్మెల్యే అవినీతి నిరూపించడానికి బిఎస్పీ సిద్ధం-ఎమ్మెల్యే సిద్ధమా*
*అక్రమ అరెస్ట్ లు చేసి ఎన్నిరోజులు తెలంగాణను పరిపాలిస్తారని బిఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు*
స్థానిక ఎమ్మెల్యే సవాలును స్వీకరించి,అవినీతి నిరూపించడానికి బిఎస్పీ పార్టీ సిద్దమని తెలిపారు.మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎమ్మెల్యే స్వంత గ్రామమైన నేరెళ్లపల్లిలో,ఎమ్మెల్యే అవినీతిని నిరూపిస్తామని స్థానిక ఎమ్మెల్యేకు-బిఎస్పీ నాయకులు సవాలు విసిరారు.ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడానికి వస్తున్నారా.లేదా 3ఎకరాల భూమి ఇవ్వడానికి వస్తున్నారా.ఉపాధి కూలీలకు కూలీ డబ్బులు చెల్లించడానికి వస్తున్నారా.నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ నల్లమట్టి వ్యాపారం ఎలా కొనసాగుతుందో సందర్శించడానికి వస్తున్నారా.(కెయల్ఐ)కాల్వ నీళ్లు ఆగిపోవడం వలన రైతుల పంట అంతా నాశనం అయింది.వారికి పంట నష్ట పరిహారం ఇవ్వడానికి వస్తున్నారా.రెండవ సారి మీప్రభుత్వం వచ్చాక రాష్ట్రములో కొత్త పింఛన్లే లేవు.కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి వస్తున్నారా,ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు అంతటి నాగన్న,బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు పృథ్వీ రాజ్,ప్రధాన కార్యదర్శి కొట్ర.బాలు,బిఎస్పీ నాయకులు ఆనంద్,శివశంకర్,బాలనాగులు,శివకృ ష్ణ,వీరస్వామి,లక్ష్మణ్,రాజ్, మహేష్ లు పాల్గొన్నారు.