మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులకు శనివారం నాడు మెదక్ ఎంపీ,సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పండరి రాజా లక్ష్మణ్ రావు 5,000 అక్షరాల అయిదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందివ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో నాయకులు బాల్ నర్సాగౌడ్,గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు పాపగారి శ్రీనివాస్,గడ్డం గిరి, పెద్దోళ్ల రాంబాబు, బోనాల నవీన్,శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.