Saturday, 7 November 2026

ఎమ్మెల్యే కల్వకుంట్ల కు వినతి పత్రం అందజేసిన మేరు సంఘ సభ్యులు

ఎమ్మెల్యే కల్వకుంట్ల కు వినతి పత్రం అందజేసిన మేరు సంఘ సభ్యులు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 19,
జనం సాక్షి :
మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మేరు సంఘ సభ్యులు సోమవారం రోజున కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను కలిసి వెల్లుల్ల గ్రామ పంచాయితీ పరిధిలోని పురాతన శ్రీ శంకర్ దాసమయ్య గుడి అభివృద్ధి పనుల కొరకు ఎమ్మెల్యే టీటీడీ నిధుల నుండి ఆర్థిక సహాయం కొరకు మేరు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందిస్తూ జనవరిలో జరుగు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశంలో మన మందిరానికి 10 లక్షల రూపాయలు నిధులు కేటాయించడానికి కృషి చేస్తానని సంఘ సభ్యులకు హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును మేరు సంఘం తరఫున ప్రత్యేక ఘనంగా సన్మానించి కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘ కార్యవర్గము మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు