Saturday, 7 November 2026

కంచే…చేను మేస్తే

కంచే…చేను మేస్తే
వరద కాలువ కబ్జాకు యత్నం
ఓ ప్రజా ప్రతినిధి నిర్వాకం*
కంచె చేను మేస్తే చేను ఎవరికి చెప్పుకోవాలి అన్న చందంగా తాను విక్రయించిన భూమి హద్దు కానీలే ఆ ప్రజాప్రతినిధి కూల్చి వేసిన ఘటన విలీన గ్రామీణ చంద్రంపెట్ లో చోటు చేసుకుంది విలీన గ్రామానుండి నూతనంగా ఏర్పాట బైపాస్ కు ఆనుకొని ఉన్న తన సొంత భూమిని మూడు కోట్ల 50 లక్షలు విక్రయించాడు భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ సైతం చేశాడు తర్వాత భూమి కొలతలు డిప్యూటీ ఇన్స్పెక్టర్ తో కొలతలు చేయించి తనకు భూమి ఇంకా ఎక్కువ వస్తుంది అని చెరువులోకి వెళ్లే కాల్వ సదను చేసి అది కూడా కొనుగోలు చేయాలని అతనిపై ఒత్తిడి తీసుకురావడంతో సదరు భూమి కొనుగోలుదారు కాల్వ సంబంధించిన జాగా తనకు అవసరం లేదని తెలపడంతో గతంలో విక్రయించిన భూమికి సంబంధించిన హద్దురాలను విరగొట్టించాడని కొనుగోలుదారు వెంకటేశం వాపోయాడు మూడు కోట్ల 50 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన జాగాను మళ్ళీ కబ్జా చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధి అతని తమ్ముడు కలిసి చేస్తున్నారని వెంకటేశం ఆవేదన వ్యక్తం చేశాడు పదిమందికి నీతులు చెప్పాల్సిన కౌన్సిలర్ అవినీతికి పాల్పడి తన భూమి హద్దులు విరగొట్టడంపై విడిసికి ఫిర్యాదు చేశాడు