Tuesday, 3 November 2026

ఎమ్మెల్యే కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు డీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పోలీస్ శాఖ

ఎమ్మెల్యే కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
డీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన పోలీస్ శాఖ
మెట్ పల్లి టౌన్, జనవరి 03,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించిన పోలీసులు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే కల్వకుంట్ల,డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, మెట్పల్లి సిఐ లక్ష్మీనారాయణ ,కోరుట్ల సిఐ రాజశేఖర్ రాజు, ఎస్సైలు కలిసి న్యూ ఇయర్ వేడుకల కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి ఎస్సై శ్యామ్ రాజ్ , కోరుట్ల ఎస్ఐ సతీష్ కుమార్ , కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,కోరుట్ల ,మేడిపల్లి,ఎస్సైలు, ఏఎస్ఐలు పోలీసులు మరియు ప్రజాప్రతినిధులు ఎంపీపీ మారు సాయిరెడ్డి ,కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ,మల్లాపూర్ ఎంపీపీ, ఇబ్రహీంపట్నం ఎంపీపీ,బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.