శాంతినగర్ లో ఘనంగా మహాత్మా సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలు
గద్వాల నడిగడ్డ, జనవరి 3 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలో మంగళవారము ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కొంకల భీమన్న మాదిగ మాట్లాడుతూ ఈ దేశంలో మహిళ చదువు కోకూడదు అంటూ బ్రాహ్మణ సామాజిక వర్గాలు కుట్ర పన్నితే మహాత్మా జ్యోతిరావు పూలే తన11వ ఏటా నే సావిత్రి బాయ్ పూలే ని వివాహం చేసుకొని ,తనను బాగచదివించి ఒక ఉపాధ్యాయురాలును చేసి, అన్ని వర్గాల ప్రజలకు తమ ద్వారా చదువులు చెప్పించాడు.అలాగే సావిత్రి బాయ్ పూలే చదువు ఎందుకు అంటూ వారికి ఎందుకు చదువు చెపుతున్నావంటూ అవమానించిన తాను వెనకడుగు వెయ్యకుండా మన సమాజానికి చదువునందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు ఐజ రాజు మాదిగ, జేఏసీ నాయకులు రామ్మోహన్, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఎషేపు మాదిగ,రాజోలి మండల నాయుడు ధనుజయ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
శాంతినగర్ లో ఘనంగా మహాత్మా సావిత్రి బాయ్ పూలే జయంతి వేడుకలు




