ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేసిన ఆశ వర్కర్స్.

అలంపూర్ ఆగష్టు 29(జనంసాక్షి )
అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో నియోజక వర్గంలో ఉన్న వివిధ మండలాల గ్రామాల్లోని 642 మంది ఆశ వర్కర్స్ మంగళవారం అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ని మర్యాద పూర్వకంగా కలిసి వారికి ఫిక్స్డ్ జీతం నెలకు 18 వేల రూపాయలను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ, ఆశ వర్కర్స్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని, మీ సమస్యలను కచ్చితంగా ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు దృష్టికి మరియు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పెద్దదిన్నె సరస్వతి, కళావతి,చెన్నమ్మ ,రేణుక , యశోదమ్మ ,మమత, తదితరులు పాల్గొన్నారు.