తాండూర్ జూలై 7 (జనంసాక్షి) తాండూర్ ప్రాంత సుభిక్షం కొరకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేపట్టిన అతిరుద్ర మహా యాగం తాండూర్ చరిత్రలో నిలిచిపోతుందని మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ అస్లం పేర్కొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా మైనార్టీ సోదరులు వార్డు యువకులతో కలిసి పూలమాల,శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మహమ్మద్ అస్లం మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తాండూరు ప్రాంతంలో అత్యధిక నిధులు కేటాయించిన ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కే దక్కుతుందని పేర్కొన్నారు.తాండూర్ ప్రాంత ప్రజల ఆయు ఆరోగ్యాల కొరకు సంవృద్దిగా వర్షాలు కురవాలని పాడిపంటలతో గ్రామాలు పచ్చగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని రైతులు రైతు కూలీల కుటుంబాలు చిరునవ్వులు చిందించాలని వ్యాపార వాణిజ్య ఉద్యోగ వర్గాలు దినదిన అభివృద్ధి చెందాలని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని యువతకు మంచి భవిష్యత్తు ఉండాలని ప్రతి ఇంట సంతోషం వెల్లివిరియాలనే మహాసం కల్పంతో చేపట్టిన అతిరుద్ర మహాయాగం తాండూర్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉర్దూగర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, మహమ్మద్ అక్రం, మొహమ్మద్ యూనుస్,సంజు నాగు భీమ్ వెంకటేష్ సుభాష్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కు అభినందనలు తెలిపిన కౌన్సిలర్ మహమ్మద్ అస్లం.




