Wednesday, 4 November 2026

టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధిగా రమేష్ కొప్పుల. పార్లమెంట్ కార్యదర్శిగా ఎండి జాఫర్.

నాగర్ కర్నూల్ బ్యూరో,జనంసాక్షి:

తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అధికార ప్రతినిధిగా రమేష్ కొప్పుల, పార్లమెంట్ కార్యదర్శిగా ఎండి జాఫర్ ఎన్నికైనట్లు రమేష్ కొప్పుల శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టిడిపి పార్లమెంట్ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యతగా కష్టపడి పార్టీ కొరకై పని చేసినందుకు మా శ్రమను రాష్ట్ర కమిటీ గుర్తించి ఈ బాధ్యతలు అప్ప జెప్పినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు పొలిటి బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి కి మరియు నాగర్ కర్నూల్ పార్లమెంటు అధ్యక్షులు రాములు కు అలాగే పార్టీలో మాతో పాటు పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.రాబోయే రోజుల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు.