Thursday, 5 November 2026

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నోరు అదుపులో పెట్టుకో

 

 

 

 

 

అలంపూర్ మే 11 జనంసాక్షి బీఎస్పీ పార్టీ అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు బి మహేష్.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, మాయావతి, ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు నీ స్థాయి మరిచి మాట్లాడితే రాష్ట్రంలో ఎక్కడ తిరగలేవని అలంపూర్ బిఎస్పీ నియోజకవర్గ మహేష్ అన్నారు.
అలంపూర్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ టూరిజం లోగురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ ఈ నెల 7 న జరిగిన తెలంగాణ భరోసా సభ సందర్బంగా బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బేహన్ జి కుమారి మాయావతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో పేద , దళిత ,బహుజన వర్గల ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడడం జరిగింది, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో నీళ్ళు లేక , నిధులు లేక , నియామకాలు లేక ఎంతోమంది బహుజన వర్గాల ప్రజలు నష్టపోతున్నారని దొరల గడియల నుండి తెలంగాణను రక్షించుకోవాలంటే బహుజన రాజ్యం రావాలి అని అన్నారు , దీనిని దృష్టి లో పెట్టుకొనికెసిఆర్ కు చెంచా గిరి చేసే ఫామ్ హౌస్ దొంగ గువ్వల బాలరాజు మాయావతి , ప్రవీణ్ కుమార్ ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇంతకు నీవు అచ్చంపేట కు చేసిన పనులు ఏమిటి అని ప్రశ్నించారు. నీ వల్ల అచ్చంపేట కు జరిగిన అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఉద్యోగిని కొట్టిన చరిత్ర నీది, ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు భూమికోసం పోరాటం చేస్తూ ఉంటే, అధికారం ను అడ్డుపెట్టుకొని తీవ్రంగా కొట్టించిన నీచమైన చరిత్ర నీది అన్నారు. నీ స్వలాభం కోసం యురేనియం త్రవ్వకాల కోసం పేదల భూమి లాక్కుని వ్యక్తివి నీవు అని అన్నారు , ఇంకో సారి మాయావతి గురించి గానీ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గురించి గానీ బీఎస్పీ పార్టీ గురించి గానీ తప్పుడు మాటలు మాట్లాడుతే తెలంగాణ రాష్ట్రంలో నీవు ఎక్కడ కూడా తిరగకుండా బీఎస్పీ పార్టీ నాయకులు, ప్రవీణ్ కుమార్ అభిమానులు అడుగడుగునా అడ్డుకుంటారని తెలియజేస్తున్నాము అన్నారు.ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.ఈ సమావేశం లో అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు మహేష్ ఉపాధ్యక్షులు యామనీ సుంకన్న , మండల కన్వీనర్ సురేష్ ,మండల అధ్యక్షుడు దేవరపోగు నాగరాజు, బీఎస్పీ పార్టీ నాయకులు నాయకంటీ కృష్ణ , స్వామెల్, రాజు పాల్గొన్నారు.