బిచ్కుంద మే 11 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండల కేంద్రంలో గల మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంఘమేశ్వర్ తమ్ముడైన శివ యొక్క నూతన గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండేకి శాలువతో ఘనంగా సన్మానించారు. ఆయనతోపాటు దరాస్ సురేష్, గఫార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




