ఎమ్మెల్యే టిక్కెట్ల పోటీలో వెంకట్ లాల్
-గార్ల మండలానికి ఒక అవకాశం ఇవ్వాలని డిమాండ్
-నాయకులతో గాంధీభవన్లో దరఖాస్తు చేసిన వెంకట్ లాల్
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్టు25(జనంసాక్షి)
కాంగ్రెస్ పార్టీ ఇల్లందు ఎమ్మెల్యే అభ్యర్థి భరిలో ఇల్లందు నియోజకవర్గంలోని గార్ల మండలానికిచెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ వెంకట్లాల్ తన పార్టీ నాయకులతో కలిసి గాంధీ భవన్లో తన ఎమ్మెల్యే పోటీపై దరఖాస్తును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెన్నారెడ్డి భారత్ చంద్రారెడ్డి, డాక్టర్ మురళి నాయక్, చీమల వెంకటేశ్వర్లతో కలిసి అందజేశారు. ఎమ్మెల్యే గా ఇప్పటివరకు ఒక్కసారి కూడా గార్ల మండలానికి ప్రాధాన్యత లేదని, ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంతం నుండి లేకపోవడం వల్ల గార్ల బయ్యారం మండలాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజాసేవ చేస్తూ గతంలో ఎంపీపీగా ఇప్పుడు ఎంపీటీసీ గా సేవలందిస్తున్న తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి అవకాశం కల్పించాలని వెంకట్ లాల్ అధిష్టానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లప్పల్లి కృష్ణ గౌడ్, జాతీయ స్త్రీ శక్తి అవార్డు గ్రహీత సంసత్ బేగం, పొలపల్లి భిక్షపతి, ఎద్దు రవి, బాపనపల్లి సురేందర్, నాసర్ల వీరభద్రం, గుగులోత్ హరి, పళ్ళ నర్సయ్య, గోసు నగేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.