Thursday, 5 November 2026

ఎమ్మెల్యే దిష్టి బొమ్మ దహనం.

మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి సూన్యమని ఎమ్మెల్యే, వీరి అనుచరుల అవినీతిని నిరంతరం నీలదీస్తున్న జువ్వాడి కృష్ణారావు ని సహించలేక విచక్షణ జ్ఞానం కోల్పోయి బిపి షుగర్ లు పెంచుకొని పిచ్చి పిచ్చి గా స్వర్గీయ రత్నాకర్ రావు స్వతంత్ర పోరాటం లో పాల్గొన్న వ్యక్తి నిరంతరం బడుగు బలహీన పేద వర్గాల కొరకు పోరాడిన వ్యక్తి జువ్వడి రత్నాకర్ రావు పై ఇలాంటి వాక్యలు చేయడం హాస్యాస్పదం గతంలో రత్నాకర్ రావు మంత్రి గా వున్నప్పుడు ఎమూ కాంట్రాక్టు సొమ్ములు డబ్బుల కొరకు ఎన్ని సార్లు వారి వెంట తిరిగి వారి కాళ్ళు మొక్కిన విషయం మర్చిపోయావా పైడిమడుగు బ్రిడ్జి శాంక్షన్ కొరకు ఎన్ని సార్లు రత్నాకర్ రావు వెంట పడి కాళ్ళు మొక్కినవు దీనికి మీ బావ వెంకటేశ్వర్ రావు తో సిఫారసు చేయించిన విషయం వాస్తవం కాదా ఖాదీ బోర్డు లో మరియు కోరుట్ల మెట్టుపల్లి మున్సిపాలిటీ లలో మీరు, మీ అనుచరులు చేస్తున్న అవినీతి అరాచకాలపై నిరంతరం నీలాదీస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కోరుట్ల మెట్టుపల్లి మున్సిపాల్టీల్లో ఇండ్లు కడుతున్న భవన యజమానుల నుండి మీరు మీ అనుచరులు కోట్లాది రూపాయలు లూటీ చేస్తున్న విషయం నిజం కాదా కోరుట్ల పట్టణం లో వేరే సర్వే నంబర్ లు చూపిస్తూ మీరు మీ అనుచరులు ప్రభుత్వ భూములు అమ్ముతున్న విషయాలు నిజం కావా? మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిన విషయం నిజం కాదా? మిమ్మల్ని అప్పటి తెరాస పార్టీ కెసిఆర్ సస్పెండ్ చేసిన విషయం నిజం కాదా? అతి సామాన్య సారా కాంట్రాక్టర్ నుండి వచ్చిన మీకు వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి? వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి విచక్షణ జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నావ్. మీరు మీ అనుచరుల అవినీతి అక్రమ అరాచకాలపై బహిరంగ చర్చకు నీవు ఎన్నుకున్న ప్రదేశం లో సిద్ధమా అని పట్టణ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం,ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్, సీనియర్ నాయకులు బెజ్జరపు శ్రీనివాస్, అబ్దుల్ హఫీజ్, దుర్గం శేఖర్, మండలం ఉపాధ్యక్షులు ఇల్లేందుల రాజు, కిసాన్ సెల్ నాయకులు గంగోని క్రాంతి, నాయకులు చింతకింది శ్రీధర్ లు పాల్గొన్నారు.