Thursday, 5 November 2026

మెటుపల్లి పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అందె భవితారాణి

మెటుపల్లి పట్టణం లో బుధవారం రోజున స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు అందె భవితారాణి మాట్లాడుతూ మోడీ (బీజేపీ) ప్రభుత్వం అడ్డుఅదుపు లేకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ పోవడం వల్ల పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు బ్రతుకు బండిని లాగేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో 400/-రూ ఉన్న వంటగ్యాస్ ధర ప్రస్తుతం మోడీ పాలనలో 1200/- చేరుకుందని గుర్తుచేశారు. ఇదే కోవలో ఉప్పులు, పప్పులు, వంట నూనెలు, పెప్రోల్, డీజిల్ ఇలా అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్ని తాకడంతో దేశ ప్రజల అవస్థలు వర్ణనాతీతం అన్నారు. దేశభక్తి అంటే ప్రజల మధ్య కుల మతాల చిచ్చు రాజేసి ఓట్లు దండుకోవడం కాదన్నారు. దేశం అంటే కులం కాదు మతం కాదు.. దేశం ఆంటే ప్రజలని, ప్రజా వ్యవస్థలని.. అలాగే ప్రజలను ప్రజా వ్యవస్థలను కాపాడడం కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. మోడీకి నిజంగా దేశం మీద దేశ ప్రజల ప్రేమ ఉంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాబోయే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశ, రాష్ట్ర ప్రజల మద్దతు తో అధికారంలోకి రావడం ఖాయమని జోష్యం చెప్పారు.