కొండమల్లేపల్లి జనవరి 18 (జనం సాక్షి ) న్యూస్ : బీఆర్ఎస్ సభకు ఖమ్మం జిల్లా నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్‌తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్‌లు, కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే సభావేదిక వద్దకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా చేరుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి తలరివచ్చారని తెలిపారు భారీ బహిరంగ సభలో కొండమల్లేపల్లి మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభలో లక్షలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని అని సభా ప్రాంగణం నుండి ఐదు కిలోమీటర్ల మేరకు ఇసుక ఇస్తే రాలనంత జనం రావడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఇంత పెద్ద భారీ బహిరంగ సభలో మునుపెన్నడు జరగకపోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు మళ్లీ రాబోయేది కచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్రంలో దేశంలో బిఆర్ఎస్ పార్టీ పాత్ర కీలకం కాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు ఖమ్మం భారీ బహిరంగ సభలో కేసాని లింగారెడ్డి తోపాటు జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, ఎంపీటీసీ వస్కుల కాశయ్య, మైనంపాటి వెంకటరెడ్డి, మాడుగుల యాదగిరి, రాహుల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
ఖమ్మం భారీ బహిరంగ సభలో కొండమల్లేపల్లి మండల బిఆర్ఎస్ ముఖ్య నాయకులు




