జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను శుక్రవారం ఏఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి తెలియ చేశారు. అలాగే మండలంలోని రొంపికుంట గ్రామములో యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అభిగౌడ్ నానమ్మ ,మిరాల పోషలు, గుండేటి బాలమ్మ, తాటికొండ రామ్ చందర్ అల్లుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను శ్రీధర్ బాబు పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రొంపికుంట లో యూత్ కాంగ్రెస్ నాయకులు మిరల రాజు ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోగ వారిని శ్రీధర్ బాబు పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పెరపల్లి గ్రామములో రావుల పోషలు,పెండ్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను శ్రీధర్ బాబు పరామర్శించి ,ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైనాల రాజు, సర్పంచులు ఆకుల ఓదెలు, కటకం రవి, తొగరి అశోక్ అన్నపూర్ణ, సిలారపు అనిత మల్లయ్య, నాయకులు గుమ్మడి సతీష్, కుందారపు బాపు , కటకం నారాయణ, భద్రపు మల్లేష్ , మాల్యాల తిరుపతి, అఫ్సర్, సయ్యద్ ఇక్బాల్, ముస్తక్, అబ్దుల్ రఫీక్,బత్తుల అంజి,పెండ్యాల రాజు, బొంగోని సదయ్య, గౌడ్, శేఖర్, నగునూరి నర్సయ్య, పిడుగు నర్సయ్య గౌడ్, బిళ్ళ కృష్ణ, యూసుఫ్ లల్లు తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శలు




