సులానగర్ పిహెచ్సి సందర్శించిన వైద్య కళాశాల బృందం

టేకులపల్లి, ఆగస్టు 29( జనం సాక్షి ): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ ని కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీ కమ్యూ నిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ మోకాళ్ళ వెంకటేశ్వరరావు తన బృందంతో కలిసి మంగళవారం సందర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు క్షేత్రస్థాయిలో అభ్యసించడానికి సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రసూతి గదిని, ప్రసూతి వార్డుని,జనరల్ వార్డు,ల్యాబ్ ని పరిశీలించారు. అనంతరం బయటి రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్, హౌస్ సర్జన్ డాక్టర్ అనూష, ఆరోగ్య విద్యా బోధకులు అమ్మని లక్ష్మీబాయి, కృష్ణవేణి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,పార్వతి,స్టాఫ్ నర్స్ సునీత, వీసం శకుంతల, కిరణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.