వనపర్తి బ్యూరో, ఏప్రిల్ 19( జనం సాక్షి) : మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామ చేయడానికి మంత్రి నిరంజన్ రెడ్డి సిద్దంగా ఉన్నారని, ఒక వేల భూ కబ్జాలకు పాల్పడలేదని తేలితే రఘునందన్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడానికి సిద్దంగా ఉండాలని వనపర్తి బిఆర్ఎస్ ధళిత నేతలు సవాల్ విసిరారు.
మంత్రి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే రఘునంధన్ రావు వాఖ్యలను ఖండిస్తూ బిఆర్ఎస్ ధళిత నాయకులు బుదవారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
మంత్రి కుమార్తెలు విదేశాల్లో,చదువుకొని అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారని,వారి సహకారంతోనే చండూరు గ్రామంలో భూములు కొన్నారని వాటికి తగిన రెవెన్యూ రికార్డులు కూడా సక్రమంగా ఉన్నాయని స్పష్టం చేశారు. అలాగే తన భార్య వాసంతి తన సొంత డబ్బుతో తన సొంత మండలంలో వ్యవసాయ భూములను కొనుగోలు చేశారని, భూములకు సంబంధించిన అన్ని పత్రాలు వారితో ఉన్నాయని,ఒక్క సెంటు భూమి ఎక్కువ ఉన్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామ చేయడానికి నిరంజన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు దళిత నాయకులు తెలిపారు.
బాజాపా పార్టీ సొంత ఏజెన్సితో కాని లేదంటే ఇతరత్ర ఏజెన్సీలతో సర్వే కూడా చేపింఉచుకోవచ్చని, సెంటు భూమి ఎక్కువ ఉన్నట్లు చూపిస్తే వారు చెప్పిన వారిపై రిజిస్టేషన్ చేయించడానికి కూడా సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
నిరంజన్ రెడ్డిపై ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇక్కడి నాయకులు రఘునంధన్ రావుకు సుపారి ఇచ్చి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని, రఘునంధన్ రావు నిజనిజాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని,లేదంటే మేం కూడా మీ నియోజకవర్
ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడానికి రఘునందన్ రావు సిద్దంగా ఉన్నారా రఘుపందన్ రావు వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. – వనపర్తి BRS ధళిత నేతలు.




