– కురువ పల్లయ్య. గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 19 (జనం సాక్షి);కుట్రపూరితంగా ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించిన రఘునందన్ వాస్తవాలు తెలుసుకో,మంత్రి నిరంజన్ రెడ్డి పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని,గద్వాల జిల్లా కేంద్రంలో బుధవారం మీడియాతో బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య అన్నారు.ఆయన మాట్లాడుతూ కనీస సమాచారం లేకుండా రఘునందన్ రావు గుడ్డి ఆరోపణలు చేయడం అవివేకం అని అన్నారు.మంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి కేసీఆర్ కి కుడి భుజంగా ఉంటూ నిరంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పైన నిక్కచ్చిగా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అని,మంత్రి నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడనీ, ఆయన స్వయంగా లాయరు ఆయన కూతుర్లు విదేశాలలో చదువుకొని డాక్టర్ గా పనిచేస్తూ వారి సొంతంగా సంపాదించిన డబ్బుతోనే పొలాలను కొనుకోవడం జరిగిందనీ అంతేగాని ఆయన అక్రమంగా గాని, ఇంకొకరి నుంచి లాక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూములు కాదనీ,రఘునందన్ ముందుగా నువ్వు తెలుసుకొని మాట్లాడు లేకపోతే తెలంగాణ రాష్ట్రం ప్రజలు నీకు చెప్తారని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగ్రామం పాన్ గల్ లో వారికి ఉన్న భూములు 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నవే.. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది మంత్రి సతీమణి సొంత డబ్బులు, బ్యాంకులోనుతో కట్టుకున్న ఇల్లు,మూడు ఫాంహౌజ్ లు ఉన్నాయని ప్రచారం చేయడం అవివేకం.. పశువుల కొట్టాలు , కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌజ్ లుగా కనిపిస్తే అది నీ అజ్ఞానానికి నిదర్శనం,ఈ మూడు వ్యవసాయ క్షేత్రాలకు రఘునందన్ రావుకు నచ్చినవాళ్లతో, నచ్చిన సర్వేయర్ ను తీసుకుని రేపే వెళ్లొచ్చు .. లేదా, ఆయనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి సర్వే చేయించుకోవడానికి అంగీకరిస్తున్నానీ, న్యాయంగా చట్టప్రకారం కొనుగోలు చేసిన దానికన్నా ఒక్క గుంట ఎక్కువ ఉన్నా ఆ భూములను మా పిల్లలు వదిలేస్తారనీ, నేను నా పదవికి రాజీనామా చేస్తానాని, లేకుంటే నువ్వు అక్కడే నీ పదవికి రాజీనామా చేసిపోవాలి అని మంత్రి విసిరిన సవాల్ స్వీకరించాలి అని అన్నారు.40 ఏళ్ల న్యాయవాద, రాజకీయ చరిత్రలో అక్రమాలకు, తప్పుడు చర్యలకు పాల్పడలేదనీ,చెప్పుడు మాటలు విని మాట్లాడకుండా కళ్ళతో చూసి మాట్లాడుఅని, చండూరు ఫామ్ హౌస్ మీరు ఒకసారి వచ్చి చూడండి వచ్చి పోయే ఖర్చులు కూడా మేము భరిస్తాం.ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నిరంజన్ రెడ్డి భయపడరు .. లేనిది ఉన్నట్లుగా చిత్రీకరించి ప్రజల్లో అభాసుపాలు చేయాలనుకోవడం అవివేకం. 1985 నుండే ఆదాయపు పన్ను చెల్లించిన న్యాయవాదిని నేను స్థాయిని మించి మాట్లాడేటప్పుడు రఘునందన్ రావు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి.నిజానిజాలు తెలుసుకోకుండా రాజకీయ దుగ్దతో చేసిన ఆరోపణలకు రఘునందన్ రావు క్షమాపణ మంత్రి నిరంజన్ రెడ్డి కి చెప్పాలి అన్నారు.




