
తాండూరు జులై 7(జనంసాక్షి) తాండూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ గా సూరత్ సింగ్ ఠాకూర్ ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నియామక పత్రాన్ని అందజేశారు. గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తాండూర్ కు చెందిన సూరసింగ్ ఠాగూర్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నియోజకవర్గ ఇన్చార్జ్ సూరసింగ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎక్కడికక్కడ ఎండగడతామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షలు సుబాద్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిడి వెంకరెడ్డి, జగదీశ్వర్ తదితరులు ఉన్నారు.




