ఎమ్మెల్యే బాబూమెహన్‌కు చేదు అనుభవం
సంగారెడ్డి: ఎమ్మెల్యే బాబూమోహన్‌కు నిరసన సెగ తగిలింది. అంథోల్‌లో విద్యుత్ ఉపకేంద్రానికి భూమిపూజ చేసేందుకు వెళ్లిన ఆయన్ని.. కాంగ్రెస్ నేతలు, స్థానికులు అడ్డుకున్నారు. ఓ సంఘానికి కేటాయించిన స్థలంలో విద్యుత్ ఉప కేంద్రాన్ని ఎలా నిర్మిస్తారంటూ నిలదీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భూమి పూజ చేసి బాబూమోహన్ వెళ్లిపోయారు.