ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని పరామర్శించిన వెంకటాపూర్ గ్రామస్తులు.
నెరడిగొండజనవరి4(జనంసాక్షి):ఇటీవల బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సోదరుడు రాథోడ్ బిక్కునాయక్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంకటాపూర్ గ్రామ పెద్దలు బుధవారం రోజున బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు సోదరులు స్వర్గీయ రాథోడ్ బిక్కు నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి వివాళులర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్తించారు.అనంతరం మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగారాం నాయక్ తుకారాం రూఫ్లా మురళీ కృష్ణ గోపిచంద్ మోతిలాల్ పర్సురాం విజేష్ ఉన్నారు.
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుని పరామర్శించిన వెంకటాపూర్ గ్రామస్తులు




