ఘనంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు గండూరి కృపాకర్ జన్మదిన వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పట్టణ క్లాత్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు , లయన్స్ క్లబ్ ఎల్సిఐఆర్ కో ఆర్డినేటర్ , జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ జన్మదిన వేడుకలు పట్టణ వ్యాపారులు, గండూరి యువసేన ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని బ్లూసి కేఫ్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ ను కట్ చేశారు.అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయనను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ , పెద్దిరెడ్డి రాజా, కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ ఆకుల లవకుశ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు అప్పం శ్రీనివాస రావు, జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా,నాయకులు శనగాని రాంబాబు గౌడ్, బొలిశెట్టి మధు , రేణుబాబు, బద్దం అశోక్ రెడ్డి, వాసవి క్లబ్ సభ్యులు, పట్టణ క్లాత్ మర్చంట్ సభ్యులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.




